News August 10, 2024
ఆగస్టు 10: చరిత్రలో ఈ రోజు

1894: మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి జననం
1914: ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ రచయిత శంకరంబాడి సుందరాచారి జననం
1945: అమెరికా దేశ రాకెట్ల పితామహుడు రాబర్ట్ గొడ్డార్డ్ మరణం
● నేడు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం
● ప్రపంచ సింహాల దినోత్సవం
Similar News
News July 8, 2025
చర్చకు రాకుంటే కేసీఆర్‌కు క్షమాపణ చెప్పు: KTR

TG: సీఎం రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ‘రేవంత్.. నిజాయితీ, నిబద్ధత ఉంటే చర్చకు రా. లేకపోతే తప్పుడు కూతలు కూసినందుకు, మహా నాయకుడిపై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి KCRకు క్షమాపణలు చెప్పు. చర్చ కోసం రేవంత్ ఎక్కడికి రమ్మన్నా వస్తా. చర్చకు సత్తా లేకపోతే సవాళ్లు చేయొద్దు. సీఎంకు వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.
News July 8, 2025
నేను బాగున్న.. దేశం కోసం పోరాడు: ఆకాశ్ సోదరి

తన సోదరి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని భారత ప్లేయర్ ఆకాశ్ దీప్ <<16971842>>ఎమోషనల్ <<>>అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన సోదరి మీడియాతో మాట్లాడారు. ‘నేను బాగున్నానని, దేశానికి మంచి చేయడంపై దృష్టి పెట్టాలని ఇంగ్లండ్‌కు వెళ్లేముందు ఆకాశ్‌తో చెప్పా. ఆకాశ్ నా గురించి బహిరంగంగా మాట్లాడతారని నాకు తెలియదు. మేము దీన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అతను ఎమోషనలై ఈ విషయాన్ని చెప్పాడు’ అని తెలిపారు.
News July 8, 2025
ప్రజాస్వామికంగా చర్చలు జరపాలి: పొన్నం

TG: పదేళ్లు అధికారంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గతంలోని పథకాలను కొనసాగిస్తూ అదనపు పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. చర్చలు ప్రజాస్వామికంగా ఉంటూ ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేయట్లేదని, స్పీకర్‌కు లేఖ రాసి <<16988692>>చర్చకు<<>> రావాలన్నారు. చర్చ జరిగితే ఎవరేంటో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.