News August 10, 2024
ఉచిత బస్సు ప్రయాణంపై ఎల్లుండి ప్రకటన!

AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటించే అవకాశముందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచనున్నట్లు తెలిపారు. RTCలో 7వేల మంది సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామన్నారు. కారుణ్య నియామకాల్లో ఆలస్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పుదుచ్చేరిలోని <
News January 16, 2026
ఆయుధం పట్టకుండా జ్ఞాన యుద్ధం చేసిన విదురుడు

మహాభారతంలో విదురుడు ఆయుధం పట్టకుండానే జ్ఞాన యుద్ధం చేశారు. కత్తి కంటేమాట పదునైనదని నమ్మి, తన వాక్చాతుర్యంతో కురువంశాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. ధృతరాష్ట్రుడి అంధకార బుద్ధికి దిక్సూచిగా ఉంటూ, దుర్యోధనుడి దురాలోచనలను ముందే పసిగట్టి హెచ్చరించారు. ధర్మం వైపు నిలబడి ఆయన చేసిన ప్రతి సూచన అహంకారంపై సాగిన భీకర పోరాటం. దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద గెలుపును విదురుని జీవితం మనకు చెబుతుంది.
News January 16, 2026
రూ.238కోట్లు కలెక్ట్ చేసిన ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో రూ.238కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ సైజ్ బ్లాక్బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించారు.


