News August 10, 2024

ఉచిత బస్సు ప్రయాణంపై ఎల్లుండి ప్రకటన!

image

AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటించే అవకాశముందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచనున్నట్లు తెలిపారు. RTCలో 7వేల మంది సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామన్నారు. కారుణ్య నియామకాల్లో ఆలస్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

ఆయుర్వేద స్నానం గురించి తెలుసా?

image

చాలామంది పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తుంటారు. కానీ శరీరానికి కలిగిన శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో కొన్ని పదార్థాలు కలిపి చేస్తే హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, మల్లెలు, గులాబీ రేకలు వేసుకుని చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు, నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే శరీరం తేలిగ్గా అవుతుంది.

News December 11, 2025

మీకంటే అసద్ యాక్టివ్: T BJP ఎంపీలతో మోదీ

image

తెలంగాణలో BJP MPలు సరైన ప్రతిపక్షపాత్ర పోషించలేకపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తంచేశారు. అసదుద్దీన్ సోషల్ మీడియా టీమ్ యాక్టివ్‌గా ఉందని ఉదహరించారు. వారి పనితీరు మారాలని, SMలో చురుగ్గా ఉండాలని హితబోధ చేశారు. AP, TGల NDA MPలకు అల్పాహార విందులో మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన భేష్ అంటూ ఈ భేటీలో కితాబు ఇచ్చారు. అందుకే ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.

News December 11, 2025

చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

image

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.