News August 10, 2024
భార్య.. అమ్మగా మారిన వేళ

TG: భార్యాభర్తలు, తల్లిదండ్రులు-బిడ్డల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న రోజులివి. ఇలాంటి సమాజంలో ఓ మహిళ తన భర్తకు అమ్మగా మారింది. ఆదిలాబాద్(D) ఏసాపూర్‌కు చెందిన విజయ్, లక్ష్మి దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. 2018లో విజయ్ 2 కిడ్నీలు చెడిపోయాయి. దీంతో భార్య ఆరేళ్లుగా కూలీ పనులకు వెళ్తూ, భర్తకు 36KMల దూరంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుకుంటోంది. ఎవరైనా సాయం చేయాలని వేడుకుంటోంది.
Similar News
News January 6, 2026
డబ్బులివ్వకుంటే సిబ్బందికి జీతాలెలా: KRMB

AP, TG ప్రభుత్వాల తీరుపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 3 త్రైమాసికాలుగా బోర్డుకు నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహించింది. FY25-26లో ఎలాంటి నిధులూ ఇవ్వకపోవడంపై 2 రాష్ట్రాల ఇరిగేషన్ ENCలకు లేఖ రాసింది. సిబ్బందికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. కాగా టెలిమెట్రీ ఫేజ్2 కోసం TG అందించిన రూ.4.15CRను మళ్లించి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు.
News January 6, 2026
డాక్టర్‌కూ తప్పని కుల వివక్ష!

TG: కులం రక్కసికి ఓ జూనియర్ డాక్టర్ బలైపోయింది. గద్వాల జిల్లాకు చెందిన లావణ్య చిన్నప్పటి నుంచి టాపర్. సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన ప్రణయ్ తేజ్ అనే యువకుడిని ప్రేమించగా అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవల కులాలు వేరని పెళ్లికి నో చెప్పడంతో ఆమె పాయిజన్ ఇంజెక్షన్ వేసుకొని సూసైడ్ చేసుకుంది. ప్రణయ్‌ను పోలీసులు అరెస్టు చేసి అట్రాసిటీ కేసు పెట్టారు.
News January 6, 2026
SIR, ECపై మరోసారి మమత ఫైర్

SIR, ECపై ప.బెంగాల్ CM మమత మరోసారి సంచలన కామెంట్లు చేశారు. BJP ఐటీ సెల్ డెవలప్ చేసిన మొబైల్ అప్లికేషన్లను WBలో ఎలక్టోరల్ రోల్ సవరణకు ఎన్నికల సంఘం చట్టవిరుద్ధంగా వినియోగిస్తోందని ఆరోపించారు. ‘SIR నిర్వహణలో అన్ని తప్పుడు చర్యలను EC అవలంబిస్తోంది. అర్హులైన ఓటర్లను చనిపోయినట్టు చూపుతోంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని విచారణకు పిలుస్తోంది. ఇది అన్యాయం, అప్రజాస్వామికం’ అని మమత ఫైరయ్యారు.


