News August 10, 2024

భార్య.. అమ్మగా మారిన వేళ

image

TG: భార్యాభర్తలు, తల్లిదండ్రులు-బిడ్డల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న రోజులివి. ఇలాంటి సమాజంలో ఓ మహిళ తన భర్తకు అమ్మగా మారింది. ఆదిలాబాద్(D) ఏసాపూర్‌కు చెందిన విజయ్, లక్ష్మి దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. 2018లో విజయ్ 2 కిడ్నీలు చెడిపోయాయి. దీంతో భార్య ఆరేళ్లుగా కూలీ పనులకు వెళ్తూ, భర్తకు 36KMల దూరంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుకుంటోంది. ఎవరైనా సాయం చేయాలని వేడుకుంటోంది.

Similar News

News September 15, 2024

సీఎం రేవంత్ నివాసం వద్ద బ్యాగ్ కలకలం

image

TG: సీఎం రేవంత్ నివాసం సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద అనుమానాస్పదంగా బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని దూరంగా తీసుకెళ్లి తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

ఏపీకి దివీస్ సంస్థ రూ.9.8 కోట్ల విరాళం

image

AP: వరద బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ముందుకొచ్చింది. మంత్రి లోకేశ్‌ను కలిసిన దివీస్ సీఈవో కిరణ్ CMRFకు రూ.5 కోట్ల చెక్కును అందించారు. దీంతో పాటు ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మరో రూ.4.8 కోట్లను అందించారు. మొత్తంగా రూ.9.8 కోట్ల విరాళమిచ్చిన దివీస్ సంస్థను లోకేశ్ అభినందించారు.

News September 15, 2024

ఏఐ వల్ల ఉద్యోగాల కోత.. 67శాతం మంది ఇంజినీర్లలో టెన్షన్

image

కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయని 67.5శాతంమంది ఇంజినీర్లలో ఆందోళన నెలకొన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని గ్రేట్ లెర్నింగ్ సంస్థ తెలిపింది. నైపుణ్యాల్ని పెంచుకోకపోతే కెరీర్‌కు రక్షణ ఉండదని 87.5శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. వచ్చే పదేళ్లలో 40శాతం వరకు జాబ్స్ ఏఐ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో 89శాతం మేర ఇంజినీర్లు AI, MLలోనే కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవాలనుకుంటున్నారని పేర్కొంది.