News August 10, 2024
మహేశ్ బాబు మనసు బంగారం
మహేశ్‌బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా సొంతూరు బుర్రిపాలెంలో నిన్న మహేశ్‌బాబు ఫౌండేషన్ మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించింది. 155 మందికి డాక్టర్లు వైద్యం చేసి, మందులు పంపిణీ చేశారు. ఇది 41వ క్యాంపు అని నిర్వాహకులు తెలిపారు. దీంతో సూపర్ స్టార్ మనసు బంగారమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆయన ఎంతో మంది పిల్లలకు గుండె సర్జరీలు <<13811914>>చేయించిన<<>> విషయం తెలిసిందే.
Similar News
News January 15, 2025
త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణ టూర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. త్వరలోనే రాహుల్ పర్యటన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అటు ఇవాళ ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
News January 15, 2025
ఆస్కార్ అవార్డులు రద్దు? 96 ఏళ్లలో ఇదే తొలిసారి
లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చును ఆర్పడం ఎవరివల్లా కావడం లేదు. ఇంతింతగా పెరుగుతున్న మంటల నుంచి ప్రజలను రక్షించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ కార్చిచ్చు ‘ఆస్కార్’ను తాకేలా కనిపిస్తోంది. దీనివల్ల ‘ఆస్కార్-2025’ ఈవెంట్ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్స్ ప్రకటన కూడా వాయిదా పడింది. ఒకవేళ రద్దయితే 96 ఏళ్లలో ఇదే తొలిసారి కానుంది.
News January 15, 2025
హైకోర్టులకు కొత్త జడ్జిలు.. TGకి నలుగురు, APకి ఇద్దరు
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను ప్రతిపాదించింది. కాగా నిన్న హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులైన విషయం తెలిసిందే. అటు ఏపీ హైకోర్టుకు అవధానం హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లను కొలీజియం రిఫర్ చేసింది.