News August 10, 2024

‘ద‌యచేసి నాన్‌వెజ్ పంప‌కండి’.. వివాదంగా సర్క్యులర్!

image

విద్యార్థుల‌కు టిఫిన్ బాక్సుల్లో నాన్‌వెజ్ పెట్ట‌వ‌ద్దంటూ నోయిడాలోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ పేరెంట్స్‌కి జారీ చేసిన స‌ర్క్యుల‌ర్ వివాదాస్ప‌ద‌మైంది. ఉద‌యం వండిన నాన్‌వెజ్‌ మ‌ధ్యాహ్నానికి పాడ‌వుతుంద‌ని, అలాగే లంచ్ టైంలో కలిసి తినేటప్పుడు ఇత‌రులు ఇబ్బంది ప‌డ‌కూడదన్న ఉద్దేశంతోనే ఈ స‌ర్క్యుల‌ర్ ఇచ్చిన‌ట్టు చెప్పింది. అయితే దీన్ని కొంద‌రు స‌మ‌ర్థించ‌గా, ఇంకొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు.

Similar News

News March 17, 2026

రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

image

TG: డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో BRS షోకాజ్ నోటీస్ ఇచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు వారం రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీకి చెందినవారు అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ వంటి వాటితో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉండటాన్ని BRS పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది.

News March 17, 2026

డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. DCP యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

News March 17, 2026

కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే!

image

సిలిండర్ బుకింగ్‌లో ఎలాంటి అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ (IOCL) కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు మిస్డ్ కాల్ ఇచ్చి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా బుక్ చేయాలనుకునే వారు 8391990070కు డయల్ చేయవచ్చు(IVRS). <<19379922>>ఓల్డ్ నంబర్స్<<>> కూడా పనిచేస్తాయని సంస్థ పేర్కొంది. share it