News August 10, 2024

CM అమెరికా టూర్.. హైదరాబాద్‌కు ‘జొయిటిస్’

image

అమెరికా పర్యటనలో ఉన్న TG CM రేవంత్ జంతు ఆరోగ్య సంస్థ ‘జొయిటిస్’ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని TG CMO తెలిపింది.

Similar News

News January 7, 2026

తూర్పు గోదావరి జిల్లాలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

AP: రాజమహేంద్రవరంలోని GMC, GGHలో 60పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా( అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్& ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ECG), బీఎస్సీ, DMLT, BSc(MLT), ఇంటర్(ఒకేషనల్), CLISc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

News January 7, 2026

మనీషా పంచకం ఎందుకు చదవాలి?

image

మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, అహంకారాన్ని తొలగించుకోవడానికి మనీషా పంచకం చదవాలి. బాహ్య రూపం, కులాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం అజ్ఞానమని, అందరిలో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటేనని ఇది బోధిస్తుంది. సమదృష్టిని పెంపొందించుకోడానికి, సత్యం వైపు పయణించడానికి ఇవి మార్గదర్శకాలు. ‘నేను శరీరాన్ని కాదు, ఆత్మను’ అనే సత్యాన్ని గ్రహించిన రోజే మనిషికి సంపూర్ణ విముక్తి లభిస్తుందని శంకరాచార్యులు ఇందులో స్పష్టం చేశారు.

News January 7, 2026

యాషెస్.. ఎదురీదుతున్న ఇంగ్లండ్

image

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ ఎదురీదుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 302/8 స్కోర్ చేసింది. దీంతో 119 పరుగుల లీడ్ సాధించింది. యంగ్ బ్యాటర్ జాకోబ్ బెతల్ 142*, డకెట్ 42, బ్రూక్ 42, జేమీ స్మిత్ 26 రన్స్ చేశారు. చేతిలో 2 వికెట్లే ఉండగా చివరి రోజు ఆసీస్ బౌలింగ్‌ను ఎంత మేర తట్టుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే 3-1 తేడాతో కంగారూలు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.