News August 10, 2024
CM అమెరికా టూర్.. హైదరాబాద్‌కు ‘జొయిటిస్’
అమెరికా పర్యటనలో ఉన్న TG CM రేవంత్ జంతు ఆరోగ్య సంస్థ ‘జొయిటిస్’ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని TG CMO తెలిపింది.
Similar News
News September 10, 2024
జైనూర్ ఘటనలో ప్రభుత్వానికి NHRC నోటీసులు
TG: ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌లో మహిళపై అత్యాచార <<14027592>>ఘటనలో<<>> రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. కాగా అత్యాచార ఘటనను NHRC సుమోటోగా స్వీకరించింది.
News September 10, 2024
APPLY NOW: దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు
స్పోర్ట్స్ కోటాలో 67 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) ప్రకటించింది. SEP 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ తదితర కేటగిరీల్లో <
News September 10, 2024
హైడ్రాకు ప్రత్యేక సిబ్బంది కేటాయింపు
TG: చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సిబ్బందిని కేటాయించింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్సై స్థాయి అధికారులను కేటాయిస్తూ డీజీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రాకు కమిషనర్‌గా రంగనాథ్ ఉన్న సంగతి తెలిసిందే.