News August 11, 2024
15 నుంచి రెవెన్యూ సదస్సులు: అనగాని

AP: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘ప్రతి గ్రామంలో ఈ సదస్సులు జరుగుతాయి. భూ ఆక్రమణలు, 22ఏ భూముల అక్రమాలతోపాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఆ ఫిర్యాదులను విచారణ జరిపి ఆన్‌లైన్ చేసి పరిష్కరిస్తాం’ అని మంత్రి వివరించారు.
Similar News
News March 28, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,48,090కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.3,540 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,35,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,50,000గా ఉంది.
News March 28, 2026
ఆయిల్ పామ్ తోటల్లో పచ్చిరొట్ట ఎరువులతో ప్రయోజనం

పచ్చిరొట్ట ఎరువులు పంటలకు మేలు చేస్తాయి. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు గల ఆయిల్ పామ్ మొక్కల పాదులలో మూడు అడుగుల దూరములో జనుమువేసి, పూతదశ వరకు పెంచిన తర్వాత దానిని చిన్నచిన్న ముక్కలుగా చేసి పాదులలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నీటి వృథా అరికట్టటమే కాకుండా నేలలో సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కల బెడద తగ్గుతుంది.
News March 28, 2026
పాండ్య ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చారా?

ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందికి హార్దిక్ పాండ్య రివార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందజేసినట్లు ప్రచారం జరిగింది. అదంతా అబద్ధమని ఒక్కొక్కరికి రూ.10వేల చెక్కు ఇచ్చారని నేషనల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. కాగా టీ20 ప్రపంచకప్ కోసం పాండ్య వాంఖడే స్టేడియంలో అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేశారు. తనకు సహకరించిన గ్రౌండ్ స్టాఫ్‌కు రివార్డు ఇస్తానని అప్పుడే మాట ఇచ్చారు.


