News August 11, 2024

బ్యాక్‌లాగ్ పోస్టులు లేకుండా ఉండేందుకు ఉమ్మడి పరీక్ష?

image

జాబ్ క్యాలెండర్‌లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ ఒకే హోదా, కేటగిరి, విద్యార్హత కలిగిన జాబ్స్‌కు ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఉమ్మడి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుని మెరిట్ జాబితాను వేర్వేరుగా ప్రకటించాలని యోచిస్తోంది. ఇలా చేస్తే బ్యాక్‌లాగ్ పోస్టులు ఏర్పడవని భావిస్తోంది.

Similar News

News January 5, 2026

రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’.. ఇదే తొలిసారి

image

TG: ఢిల్లీలో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర కళాకారులు ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వనున్నారు. రాష్ట్ర సాంస్కృతిక జీవనంలో భాగమైన ఒగ్గుడోలు ప్రదర్శనకు రిపబ్లిక్ డే పరేడ్‌లో చోటు దక్కడం ఇదే తొలిసారి. ఇందుకోసం సిద్దిపేట, జనగామ, జగిత్యాల, వికారాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుంచి 30 మంది కళాకారులను ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లి 8వ తేదీ నుంచి రిహార్సల్స్ చేయనున్నారు.

News January 5, 2026

అల్పపీడనం.. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. 9వ తేదీ నుంచి TNతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో అల్లూరి, ఏలూరు, ప.గో., NTR, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ చెప్పింది.

News January 5, 2026

శివ మానస పూజలో చదవాల్సిన మంత్రాలు

image

‘శివ మానస పూజ స్తోత్రం’ దీనికి ప్రధాన మంత్రం. ఇది ‘రత్నైః కల్పితమాసనం’ అని మొదలవుతుంది. ఈ స్తోత్రం చదవడం వీలుకాకపోతే కేవలం ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ పూజ చేయవచ్చు. లేదా ‘శివోహం శివోహం’ అని స్మరించవచ్చు. చివరగా ‘ఆత్మా త్వం గిరిజా మతిః’ అనే శ్లోకాన్ని పఠించినా విశేష ఫలితాలుంటాయి. ఈ పూజలో మన ప్రతి కర్మను శివుడికి అర్పించాలి. శివ మానస పూజను ఎవరైనా, ఎప్పుడైనా ఆచరించవచ్చు.