News August 11, 2024
బ్యాక్‌లాగ్ పోస్టులు లేకుండా ఉండేందుకు ఉమ్మడి పరీక్ష?
జాబ్ క్యాలెండర్‌లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ ఒకే హోదా, కేటగిరి, విద్యార్హత కలిగిన జాబ్స్‌కు ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఉమ్మడి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుని మెరిట్ జాబితాను వేర్వేరుగా ప్రకటించాలని యోచిస్తోంది. ఇలా చేస్తే బ్యాక్‌లాగ్ పోస్టులు ఏర్పడవని భావిస్తోంది.
Similar News
News September 16, 2024
హీరో దర్శన్ అంతకుముందు ఉన్న జైలులో ఫోన్లు, కత్తులు
హత్య కేసులో అరెస్టయిన సినీ హీరో దర్శన్‌కు VIP ట్రీట్‌మెంట్ ఇచ్చిన బెంగళూరు జైలులో పోలీసులు తాజాగా రైడ్ చేశారు. 15 ఫోన్లు, ₹1.3లక్షల విలువైన శామ్‌సంగ్ డివైస్, 7 ఎలక్ట్రిక్ స్టవ్‌లు, 5 కత్తులు, 3 ఫోన్ ఛార్జర్లు, పెన్ డ్రైవ్‌లు, ₹36,000 నగదు, సిగరెట్, బీడీ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. VIP ట్రీట్‌మెంట్ విషయం వివాదంగా మారడంతో దర్శన్‌ను బళ్లారి జిల్లా జైలుకు మార్చిన సంగతి తెలిసిందే.
News September 16, 2024
ట్రక్కు డ్రైవర్‌తో కూడా గంభీర్ గొడవపడ్డారు: చోప్రా
టీమ్ ఇండియా కోచ్ గంభీర్ గ్రౌండ్‌లోనే కాక ఎక్కడైనా గొడవకు రెడీగానే ఉంటారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపారు. ‘గంభీర్ చాలా త్వరగా సహనాన్ని కోల్పోతారు. ఢిల్లీలో ఓసారి ఓ ట్రక్కు డ్రైవర్ రాంగ్ రూట్‌లో వచ్చాడు. పైపెచ్చు గంభీర్‌పై నోరు పారేసుకున్నాడు. దీంతో కారు దిగి ట్రక్కు పైకి ఎక్కి డ్రైవర్ కాలర్ పట్టుకుని గొడవపడ్డారు. తేడా వస్తే గంభీర్‌తో అలాగే ఉంటుంది’ అని వివరించారు.
News September 16, 2024
5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.160 పెరిగి రూ.75,050కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.150 పెరిగి రూ.68,800 పలుకుతోంది. గత 5 రోజుల్లో ధర ఏకంగా రూ.1750 పెరిగింది. ఇక వెండి ధర కేజీ మరో రూ.1,000 పెరిగి రూ.98వేలకు చేరింది. 5 రోజుల్లో వెండి ధర రూ.6,500 పెరగడం గమనార్హం.