News August 12, 2024
డేంజర్‌లో ప్రభాస్ ‘కల్కి’ రికార్డ్?
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ‘కల్కి 2898ఏడీ’ హిందీలో తొలిరోజే రూ.23 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అయితే శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ 2’ హిందీ బెల్ట్‌లో ఆ కలెక్షన్లను బద్దలుగొట్టే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ నెల 15న రిలీజ్ కానుండగా 14న రాత్రి నుంచే షోలు మొదలుకానున్నాయి. తొలి భాగం ‘స్త్రీ’ రూ.100 కోట్లు సాధించడంతో సెకండ్ పార్ట్‌కి తొలిరోజు రూ.30 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
Similar News
News January 15, 2025
భారత్ ఘన విజయం
ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 436 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐరిష్ జట్టును 131 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 304 రన్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇండియా బౌలర్లలో దీప్తి 3, తనూజ 2, సాధు, సయాలి, మిన్నూ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.
News January 15, 2025
ఆకట్టుకుంటోన్న స్పెషల్ బాబాలు
మహా కుంభమేళాకు వచ్చిన స్పెషల్ బాబాలు ఆకట్టుకుంటున్నారు. అందులో ఐఐటియన్ బాబా, 14 ఏళ్లుగా ఒక చేయిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధే పురీ బాబా, పురాతన కారులో వచ్చిన అంబాసిడర్ బాబా, తలపై వరి, మిల్లెట్ మొక్కలు పెంచే అనాజ్ వాలే బాబా, చాయ్ వాలే బాబా, 32 ఏళ్లుగా స్నానం ఆచరించని 3.8 ఫీట్ బాబా, తలపై 2 లక్షల రుద్రాక్షలు ధరించిన గీతానంద గిరి బాబా, తలపై పావురం కలిగి ఉన్న మహంత్ రాజ్‌పురీ జీ మహారాజ్ ఉన్నారు.
News January 15, 2025
నామినేషన్ వేసిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేశారు. తన భార్య, పార్టీ నేతలు, అభిమానులు వెంట రాగా ఆయన నామినేషన్ ఫైల్ చేశారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ కావడంతో ఇటీవలే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.