News August 12, 2024

డేంజర్‌లో ప్రభాస్ ‘కల్కి’ రికార్డ్?

image

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ‘కల్కి 2898ఏడీ’ హిందీలో తొలిరోజే రూ.23 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అయితే శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ 2’ హిందీ బెల్ట్‌లో ఆ కలెక్షన్లను బద్దలుగొట్టే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ నెల 15న రిలీజ్ కానుండగా 14న రాత్రి నుంచే షోలు మొదలుకానున్నాయి. తొలి భాగం ‘స్త్రీ’ రూ.100 కోట్లు సాధించడంతో సెకండ్ పార్ట్‌కి తొలిరోజు రూ.30 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Similar News

News September 15, 2024

రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్: కేంద్రమంత్రి

image

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నంబర్ వన్ టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలని అన్నారు. సిక్కులను రాహుల్ విభజించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

News September 15, 2024

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: సీపీఐ రామకృష్ణ

image

AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని CM చంద్రబాబుని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. విలువైన ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీలో మూడో ప్లాంట్ కూడా మూసివేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని CBNకు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.

News September 15, 2024

BANతో టీ20లకు గిల్, పంత్‌ దూరం?

image

అక్టోబర్ 7 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే 3 మ్యాచుల టీ20 సిరీస్‌కు గిల్‌తో పాటు బుమ్రా, సిరాజ్, పంత్‌కు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. వర్క్ లోడ్‌ను మేనేజ్ చేసేందుకు, రాబోయే టెస్ట్ సిరీస్‌ల దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో టీ20 టీమ్‌కు ఎవరెవరు సెలక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది.