News August 12, 2024

నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్

image

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో కొన్ని వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. <<13827490>>FORDA<<>> పిలుపు మేరకు వైద్య సిబ్బంది ఆందోళనలు చేయనున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌ని కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.

Similar News

News January 21, 2025

APSRTCకి కాసుల వర్షం

image

AP: సంక్రాంతి పండుగ భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న 3 రోజుల పాటు రోజుకు రూ.20కోట్లకు పైగా ఖజానాలో జమయ్యాయని తెలిపింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 9వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు వెల్లడించింది.

News January 21, 2025

ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జి.. బిల్ ఎంతంటే?

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. కాగా సైఫ్ ఆస్పత్రి పూర్తి బిల్లు రూ.40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ రూ.25 లక్షలు చెల్లించినట్లు సమాచారం. సైఫ్ నుంచి ఆస్పత్రి యాజమాన్యం రోజుకు రూ.7 లక్షలకుపైగా వసూలు చేసినట్లు టాక్. మరోవైపు సైఫ్‌ను రక్షించిన ఆటోడ్రైవర్‌కు ఓ సంస్థ రూ.11 వేల రివార్డు ప్రకటించింది.

News January 21, 2025

32,438 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.