News August 12, 2024

నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్

image

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో కొన్ని వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. <<13827490>>FORDA<<>> పిలుపు మేరకు వైద్య సిబ్బంది ఆందోళనలు చేయనున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌ని కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.

Similar News

News September 17, 2024

కొనసాగుతున్న సీఎంల రాజీనామా ఒరవడి

image

ప్ర‌భుత్వంలో కుమ్ములాట‌లు, MLAల‌ ఫిరాయింపులు, కోర్టు కేసుల వల్ల ఇటీవల ప‌ద‌విలో ఉన్న CMలు రాజీనామాలు చేస్తున్న ఒర‌వ‌డి కొన‌సాగుతోంది. గ‌తంలో MHలో ఉద్ధ‌వ్ ఠాక్రే, MPలో క‌మ‌ల‌నాథ్, ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, హ‌రియాణ‌లో మ‌నోహ‌ర్ లాల్, KAలో య‌డియూర‌ప్ప‌, గుజ‌రాత్‌లో విజ‌య్‌ రూపాని, ఉత్త‌రాఖండ్‌లో త్రివేంద్ర‌ సింగ్ ప‌ద‌విలో ఉండ‌గా రాజీనామా చేశారు. తాజాగా ఢిల్లీ CM కేజ్రీవాల్ ఈ జాబితాలో చేర‌నున్నారు.

News September 16, 2024

వివ్ రిచ‌ర్డ్స్‌తో తల్లి సంబంధం వల్ల వేధింపులు ఎదుర్కొన్నా: మసాబా గుప్తా

image

విండీస్ క్రికెట‌ర్ వివ్ రిచ‌ర్డ్స్‌తో త‌న త‌ల్లికి ఉన్న సంబంధం వ‌ల్ల 7వ త‌ర‌గ‌తిలోనే వేధింపులకు గురైనట్టు నేనా గుప్తా కుమార్తె మ‌సాబా గుప్తా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న త‌ల్లి గ‌ర్భం దాల్చిన‌ప్పుడు త‌న‌ది అక్ర‌మ సంతానంగా భావిస్తూ నేనా గుప్తా త‌ల్లిదండ్రులు ఎవ‌రూ చూట్టూ లేర‌ని, త‌న తండ్రి రిచ‌ర్డ్స్ కూడా లేర‌న్నారు. తాను శారీరకంగా ఎలా ఉన్నది, లేదా ఎందుకలా ఉన్నది కూడా చాలా మందికి అర్థం కాలేదన్నారు.

News September 16, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షం కురవనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.