News August 12, 2024
Stock Markets: క్రాషేం లేదు.. స్వల్ప నష్టాలే

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం BSE సెన్సెక్స్ 258 పాయింట్ల నష్టంతో 79,447, NSE నిఫ్టీ 80 పాయింట్లు ఎరుపెక్కి 24,286 వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు నిఫ్టీ 397 పాయింట్లు పతనమై 72,321 వద్ద ట్రేడవుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3, అదానీ పోర్ట్స్ 2 శాతానికి పైగా నష్టపోయాయి.
Similar News
News November 11, 2025
యాక్టివేటెడ్ చార్‌కోల్‌తో ఎన్నో లాభాలు

ప్రస్తుత కాలంలో ఫేస్ క్రీం, ఫేస్ వాష్ ఎందులో చూసినా యాక్టివేటెడ్ చార్‌కోల్ ఉంటోంది. దీంతో చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. * ఇది ఓపెన్ పోర్స్‌ను అన్‌క్లాగ్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా పని చేస్తుంది. * మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యాక్టివేటెడ్ చార్‌కోల్ కీలక పాత్ర పోషిస్తుంది. పొడిబారిన చర్మానికి తేమను అందిస్తుంది.
News November 11, 2025
బయో-కెమికల్ వార్: ఉగ్రసంస్థల కొత్త వ్యూహం

భారత్‌పై విషం చిమ్మేందుకు ఉగ్రసంస్థలు రూటు మార్చాయి. నిఘా, తనిఖీలు, సప్లై తదితర సవాళ్లు పెరగడంతో స్థానిక పదార్థాలతో నరమేధం సృష్టించే నైపుణ్యం గల వారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. రసాయనాలు, వాటితో మంచి చెడులు వైద్యులకు తెలియడంతో వారినే పావులుగా మారుస్తున్నాయి. ఆముదాలతో రెసిన్ విషం తయారుచేస్తూ పట్టుబడ్డ HYD Dr. మొయిన్, ఫరీదాబాద్‌లో అమ్మోనియం నైట్రేట్ యూరియాతో దొరికిన ముగ్గురు వైద్యులు ఇందుకు ఉదాహరణ.
News November 11, 2025
ప్రమాదం.. వ్యక్తిని కాపాడిన స్మార్ట్ వాచ్

మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు స్మార్ట్ వాచ్ ఎలా సహాయపడుతుందో తెలిపే ఘటనే ఇది. ఓ వ్యక్తికి తీవ్ర ప్రమాదం జరిగినప్పుడు అతడి చేతికి ఆపిల్ వాచ్ ఉంది. BP, పల్స్ పడిపోవడాన్ని వాచ్ గ్రహించి ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేసింది. అతడి లొకేషన్‌ను కొడుకుకు & అంబులెన్స్‌కు హెచ్చరిక సందేశాన్ని పంపింది. బాధితుడు క్షేమంగా బయటపడ్డారు. అత్యవసర SOS ఫీచర్‌లు యాపిల్‌తో పాటు Samsung & Google Pixel వాచ్‌ల్లోనూ ఉన్నాయి.


