News August 12, 2024

Stock Markets: క్రాషేం లేదు.. స్వల్ప నష్టాలే

image

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం BSE సెన్సెక్స్ 258 పాయింట్ల నష్టంతో 79,447, NSE నిఫ్టీ 80 పాయింట్లు ఎరుపెక్కి 24,286 వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు నిఫ్టీ 397 పాయింట్లు పతనమై 72,321 వద్ద ట్రేడవుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3, అదానీ పోర్ట్స్ 2 శాతానికి పైగా నష్టపోయాయి.

Similar News

News September 18, 2024

రిటైర్మెంట్ అంటే జోక్‌గా మారింది: రోహిత్

image

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో రిటైర్మెంట్ అంటే జోక్‌గా మారిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. కొందరు ఆటకు వీడ్కోలు పలికి తిరిగి ఆడుతున్నారని చెప్పారు. అయితే భారత జట్టులో అలాంటిదేమీ లేదన్నారు. తన రిటైర్మెంట్ విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నానని తెలిపారు. T20Iలకు గుడ్ బై చెప్పిన విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.

News September 18, 2024

భారత్‌లో లెనోవో ఏఐ సర్వర్ల తయారీ

image

భారత్‌లోని తమ ‘పుదుచ్ఛేరి’ ప్లాంట్‌లో ఏటా 50వేల ఏఐ ర్యాక్ సర్వర్లు, 2400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు(GPU) ఉత్పత్తి చేయనున్నట్లు లెనోవో ప్రకటించింది. ఈ ఉత్పత్తుల్ని భారత్‌లో అమ్మడంతో పాటు ఎగుమతులూ చేస్తామని వివరించింది. బెంగళూరులో ఓ ఏఐ కేంద్రీకృత ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. యాపిల్, ఫాక్స్‌కాన్, డెల్ సంస్థల తరహాలోనే లెనోవో కూడా చైనాలో పెట్టుబడులు తగ్గించి భారత్‌లో పెంచుతోంది.

News September 18, 2024

బాధితులకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం

image

AP: ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.