News August 13, 2024
ఏడాదికి రూ.2.52 లక్షల జీతం.. కాగ్నిజెంట్‌పై ట్రోల్స్!
MNCలూ బీటెక్ పూర్తిచేసిన ఫ్రెషర్స్‌కు రూ.20వేలు మాత్రమే జీతం ఇస్తున్నాయి. తాజాగా 2024 బ్యాచ్‌కి చెందిన వారికోసం ఆఫ్ క్యాంపస్ మాస్ హైరింగ్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. వార్షిక వేతనం రూ.2.52 లక్షలు ఇస్తామని తెలిపింది. అయితే, దీనిపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. చదువు లేకపోయినా మోమోస్ దుకాణంలో హెల్పర్‌గా చేస్తే నెలకు రూ.25వేలు ఇస్తున్నారని
ఓ పోస్టర్‌ను షేర్ చేశారు.
Similar News
News February 8, 2025
ముస్లింల ప్రాంతంలో ఆప్ ముందంజ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్ ఆధిపత్యం కనబరుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. దీంతో ముస్లిం ప్రాంతాలల్లో ఆప్ పట్టు నిలుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవరాల్‌గా బీజేపీ 30 చోట్ల, ఆప్ 24 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక చోట లీడింగ్‌లో ఉంది.
News February 8, 2025
1956-93 మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎందుకు లేదు?
1952లో ఢిల్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. 1956 నుంచి 93 వరకు అసెంబ్లీ మనుగడలో లేదు. 1956 NOV 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర హోదా కోల్పోయి UTగా మారింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం వచ్చింది. 56 ఎలెక్టెడ్, LG నామినేటెడ్ మెంబర్స్ ఐదుగురు ఉండేవారు. అయితే వీరికి శాసనాధికారాలు లేవు. 1991లో 69వ సవరణ ద్వారా అసెంబ్లీ మళ్లీ మనుగడలోకి వచ్చింది.
News February 8, 2025
ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి కిందటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు ఆప్ 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానానికే పరిమితమైంది.