News August 14, 2024

1947: బల్బులు, జంతువులను కూడా పంచుకున్నారు!

image

భారత్, పాకిస్థాన్ విభజనపై నాటి విభజన మండలి పెద్దలు పెద్ద యజ్ఞమే చేశారు. సైన్యం పంపిణీ అతి పెద్ద సవాల్‌గా మారింది. భారత్‌కు 2.6 లక్షలు, పాక్‌కు 1.4 లక్షల బలగాలు దక్కాయి. పాక్ సైనికుల్లో అత్యధికులు ముస్లింలే. టాస్‌లో నెగ్గి గుర్రపు బగ్గీని భారత్ దక్కించుకుంది. ఆస్తులన్నింటినీ ఇరుదేశాలు 80:20 నిష్పత్తిలో పంచుకున్నాయి. బల్బులు, జోయ్‌మొనీ ఏనుగు విషయంలోనూ పెద్ద ప్రహసనం నడిచినా ఇండియానే దక్కించుకుంది.

Similar News

News February 8, 2025

అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోతున్నారు: అన్నా హజారే

image

ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్‌పై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదని తెలిపారు. సామాజిక కార్యకర్త అయిన అన్నా హజారేకు గతంలో కేజ్రీవాల్ శిష్యుడిగా ఉన్నారు.

News February 8, 2025

1200 ఓట్ల వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్

image

న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ వైపు గాలి వీస్తోంది. ఒక్కో రౌండు లెక్కింపు ముగిసే కొద్దీ ఆమ్‌ఆద్మీ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 9 రౌండ్లు ముగిసే సరికి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ 1200 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు కల్కాజీలో సీఎం ఆతిశీ మార్గేనా 3231 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ 45, ఆప్ 25 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

News February 8, 2025

సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోదీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ సంబరాలకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్యాలయంలో సాయంత్రం సెలబ్రేషన్స్ చేసుకోనుంది. దీనికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరుకానున్నారు.

error: Content is protected !!