News February 8, 2025

అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోతున్నారు: అన్నా హజారే

image

ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్‌పై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదని తెలిపారు. సామాజిక కార్యకర్త అయిన అన్నా హజారేకు గతంలో కేజ్రీవాల్ శిష్యుడిగా ఉన్నారు.

Similar News

News February 13, 2026

Kiss day: ముద్దు ‘ముచ్చట్లు’ తెలుసా?

image

వాలంటైన్స్ వీక్‌లో ఇవాళ కిస్ డేగా జరుపుకుంటారు. ఒక్కో ముద్దు ఒక్కో భావాన్ని వ్యక్తపరుస్తుంది
✥ నుదుటిపై: అభిమానం, ధైర్యాన్ని వ్యక్తం చేస్తుంది
✥ బుగ్గపై: ఆప్యాయతను, ప్రేమను సూచిస్తుంది
✥ చేతిపై: రెస్పెక్ట్ లేదా రొమాంటిక్ ప్రపోజ్
✥ ముక్కుపై: ఇష్టాన్ని తెలియజేస్తుంది
✥ నెక్ కిస్: ఒకరిపై ఒకరికి శృంగార కోరికను వ్యక్తపరుస్తుంది
✥ ఫ్రెంచ్/లిప్ కిస్: ఇద్దరి మధ్య డీప్ రొమాన్స్‌/లవ్‌ను సూచిస్తుంది

News February 13, 2026

బంగ్లాదేశ్ ఎన్నికలు.. BNP ఘనవిజయం

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) కూటమి ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 209 సీట్లు సొంతం చేసుకుంది. ప్రధాన పోటీదారు అనుకున్న జమాతే ఇస్లామీ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపలేదు. దీంతో ప్రధానిగా తారిఖ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొన్ని గంటల్లో అధికారికంగా ఫలితాలు వెల్లడించనున్నారు.

News February 13, 2026

ఆలస్యంగా వరి నాట్లు.. కలుపు నివారణ

image

ఆలస్యంగా వరి నాటిన పొలంలో 15-20 రోజుల సమయంలో గడ్డిజాతి కలుపు ఉన్నట్లు గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో సైహలోపాప్ బ్యుటైల్ 10% ఇ.సి 400ml ద్రావణం లేదా బిస్‌ఫైరిబాక్ సోడియం 10% S.C ద్రావణం 80ML కలిపి పిచికారీ చేయాలి. అదే అంతర తామర, పిల్లడుగు, గుర్రపుడెక్క వంటి వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉంటే నాటిన 20-25 రోజుల వేళ 200 లీటర్ల నీటిలో ఎకరాకు 2,4 డి.సోడియం సాల్ట్ 80% పొడి 400 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.