News August 14, 2024
హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషస్
హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మారిషస్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ మండిపడింది. షెల్ కంపెనీల ఏర్పాటుకు తమ రూల్స్ అంగీకరించవని తెలిపింది. తమను ట్యాక్స్ హెవెన్‌గా వర్ణించేందుకు వీల్లేదంది. గ్లోబల్ బిజినెస్ కంపెనీల కోసం తమ వద్ద పటిష్ఠ వ్యవస్థలు ఉన్నట్టు చెప్పింది. రిపోర్టులో ప్రస్తావించిన IPE ప్లస్ ఫండ్, IPE ప్లస్ ఫండ్ వన్‌కు తమ లైసెన్సులు లేవంది. అవి మారిషస్ కేంద్రంగా ఏర్పాటైనవి కాదని వెల్లడించింది.
Similar News
News January 20, 2025
భోజనం తర్వాత ఈ రెండూ చేయకండి
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొద్దు. ఎందుకంటే మనం తినే సమయంలో పొట్టలోకి జీర్ణరసాలు వచ్చి ఆహారం డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి. తినగానే నీళ్లు తాగితే ఈ రసాలు పలుచబడి జీర్ణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనేది డాక్టర్ల సూచన. ఇక రాత్రి మోతాదుగా, తేలిక ఆహారం, అది కూడా పడుకునే 2-3 గంటల ముందు తింటే మంచిది. తిన్న అరగంట లోపు పడుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి లైట్ యాక్టివిటీ ట్రై చేయండి.
News January 20, 2025
చైనా దూకుడు.. ఏడాదిలో 800KMS మెట్రో మార్గం పొడిగింపు!
దేశంలోని నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను గట్టెక్కిస్తోన్న మెట్రో రైళ్లను విస్తరించడంలో ఇండియా స్పీడు పెంచాల్సి ఉంది. 2024లో ఇండియాలో కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. అదే చైనాలో మాత్రం ఒకే ఏడాదిలో 800+కి.మీలు మెట్రో మార్గాన్ని విస్తరించారు. కాగా, ఇండియాలో మొత్తం 1,000 కి.మీల మెట్రో మార్గం ప్రస్తుతం అందుబాటులో ఉంది.
News January 20, 2025
భారీగా IPSల బదిలీ
APలో 27 మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
*పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనా
*కర్నూల్ ఎస్పీగా విక్రాంత్ పాటిల్
*కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్
*ఎర్రచందనం యాంటీ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా సుబ్బరాయుడు
*తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
*ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా పాలరాజు
*IGP ఆపరేషన్స్‌గా సీహెచ్ శ్రీకాంత్