News August 14, 2024
HATSOFF: తానే రంగంలోకి దిగిన హెచ్ఓడీ
కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచారం ఘటనలో న్యాయం కోసం అక్కడి డాక్టర్లు నిరనస బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో NRS వైద్య కళాశాలలోని వార్డుల్లో వైద్య సిబ్బంది కరవయ్యారు. రోగులు ఇబ్బంది పడుతుండటంతో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి మిలన్ చక్రవర్తి రంగంలోకి దిగారు. ఓ విభాగాధిపతి అయ్యుండి, ఇంటెర్న్స్ లేదా రెసిడెంట్ వైద్యులు చేసే పనుల్ని తానే చక్కబెడుతున్నారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Similar News
News January 20, 2025
TODAY HEADLINES
✒ ఖోఖో తొలి వరల్డ్ కప్.. విజేతగా భారత్
✒ బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం
✒ AP: 2028కి రాష్ట్రమంతా పోలవరం నీళ్లు: అమిత్ షా
✒ APకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది: సీఎం
✒ APలోనే తొలిసారి గుంటూరులో ‘కొకైన్’ కలకలం
✒ లోకేశ్‌ను Dy.CM చేయడానికి షా ఒప్పుకోలేదు: అంబటి
✒ TGలో కాపిటా ల్యాండ్ ₹450 కోట్ల పెట్టుబడులు: CMO
✒ రేషన్ కార్డు రూల్స్‌లో మార్పులు చేయాలి: హరీశ్
✒ వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం
News January 20, 2025
మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం.. యోగికి మోదీ ఫోన్
మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు సంఘటనా స్థలాన్ని యోగి పరిశీలించారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక అధికారులు ఆయనకు తెలియజేశారు. కాగా సిలిండర్ పేలుడు వల్లే మంటలు చెలరేగినట్లు గుర్తించారు.
News January 20, 2025
పని నాణ్యతే ముఖ్యం: భారత్ పే సీఈఓ
వారంలో 90 గంటలు పనిచేయడమనేది చాలా కష్టమని భారత్ పే CEO నలిన్ నెగీ తెలిపారు. వర్క్ అవర్స్ కంటే ఎంత నాణ్యతతో పని చేశామనేదే ముఖ్యమన్నారు. ఉద్యోగి ఒత్తిడితో కాకుండా సంతోషంగా పనిచేస్తేనే సంస్థకు లాభమని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.