News August 15, 2024

22 నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్

image

AP: డిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. 24 వరకు రిజిస్ట్రేషన్లు, 23-25 వరకు ధ్రువపత్రాల పరిశీలన, కోర్సుల ఎంపిక, 26న ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. 29న సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3లోపు కాలేజీల్లో చేరాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,045 డిగ్రీ కళాశాలల్లో 3,33,757 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 1,27,659 సీట్లు భర్తీ అయ్యాయి.

Similar News

News January 20, 2026

హ్యాట్సాఫ్.. రూ.2కోట్ల ఆస్తిని దానం చేశారు

image

AP: నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ యావదాస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు. దాదాపు రూ.2కోట్ల విలువజేసే ఆస్తి ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి రాసిచ్చేసిన ఈ దంపతులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News January 20, 2026

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ఆదేశాలు

image

TG గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025 JAN 1 నుంచి DEC 31 మధ్య CBFC ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. కొత్తగా ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు, ప్రత్యేక విభాగంలో డా.సి.నారాయణరెడ్డి అవార్డులను అందజేయనున్నారు. ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

News January 20, 2026

జనవరి 20: చరిత్రలో ఈరోజు

image

1900: సంస్కృతాంధ్ర పండితుడు పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం
1907: ప్రముఖ రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం
1920: సినీ దర్శకుడు, ‘జానపద బ్రహ్మ’ బి.విఠలాచార్య జననం
1940: సినీనటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు జననం (ఫొటోలో)
1957: భారత్ తొలి అణు రియాక్టర్ ‘అప్సర'(ముంబై) ప్రారంభం