News August 15, 2024

‘ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్’ కన్నుమూత

image

DRDO మిస్సైల్ సైంటిస్ట్ రామ్ నరైన్ అగర్వాల్(84) HYDలో కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో పోరాడుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని జైపుర్‌లో జన్మించిన ఆయన 1983లో లాంచ్ అయిన అగ్ని ప్రోగ్రామ్‌లో విశేష సేవలు అందించారు. ‘అగ్ని మిస్సైల్స్‌’కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన్ను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్‌గా పిలుస్తారు. 1990లో పద్మశ్రీ, 2000లో పద్మ భూషణ్‌ అవార్డులు అందుకున్నారు.

Similar News

News October 31, 2025

ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: CM

image

AP: ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను CM CBN ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన, ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు. NOVలో జరిగే CII సదస్సులోగా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు CMకు తెలిపారు.

News October 31, 2025

ఆవు నెయ్యి అభిషేకంతో ఐశ్వర్య ప్రాప్తి

image

శివుడికి అభిషేకాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆయనకు చాలామంది అభిషేకాలు చేస్తుంటారు. అలా చేసినవారిపై ఆయన అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఆవు నెయ్యితో శివ లింగాన్ని అభిషేకించడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. శ్రేయస్సుకు, పవిత్రతకు చిహ్నంగా భావించే ఈ అభిషేకం ద్వారా అదృష్టం, సంపద కలిసివస్తాయని, ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని నమ్మకం.

News October 31, 2025

2,790 మంది ఇండియన్స్‌ను US తిరిగి పంపింది: కేంద్రం

image

చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన ఇతర దేశస్థులను అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు US నుంచి 2,790 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా అక్కడ చట్టవిరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి నివసించారని పేర్కొన్నారు. అటు 2025లో ఇప్పటివరకు దాదాపు 100 మంది అక్రమవలసదారులను UK తిరిగి పంపిందని తెలిపారు.