News August 15, 2024
‘ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్’ కన్నుమూత
DRDO మిస్సైల్ సైంటిస్ట్ రామ్ నరైన్ అగర్వాల్(84) HYDలో కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో పోరాడుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని జైపుర్‌లో జన్మించిన ఆయన 1983లో లాంచ్ అయిన అగ్ని ప్రోగ్రామ్‌లో విశేష సేవలు అందించారు. ‘అగ్ని మిస్సైల్స్’కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన్ను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్‌గా పిలుస్తారు. 1990లో పద్మశ్రీ, 2000లో పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు.
Similar News
News September 18, 2024
పరారీలో జానీ మాస్టర్
TG: అత్యాచారం కేసు తర్వాత జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి దగ్గర లేకపోవడంతో పాటు ఫోన్‌కు కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన కోసం నార్సింగి పోలీసులు గాలింపు చేపట్టారు. లద్దాక్‌లో ఉన్నారన్న సమాచారంతో నాలుగు బృందాలు ఆయన కోసం అక్కడకు బయల్దేరాయి. తొలుత ఆయన నెల్లూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడి పోలీసులనూ సంప్రదించారు.
News September 18, 2024
పదే పదే ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం: కేంద్రమంత్రి
లా కమిషన్ 1999లో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. ‘భారత్ వేగంగా అభివృద్ధి కావాలని యువత కోరుకుంటోంది. పదే పదే ఎన్నికలతో ఇందుకు ఆటంకం కలుగుతోంది. 2015లో పార్లమెంట్ కమిటీ కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి, అనంతరం 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు.
News September 18, 2024
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్
ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌కు తమ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్‌ను పంజాబ్ కింగ్స్ నియమించింది. ఈ మేరకు ట్విటర్‌లో ప్రకటించింది. ‘పంటర్(పాంటింగ్) ఈజ్ పంజాబ్! మా కొత్త హెడ్ కోచ్ పదవిలో పాంటింగ్ జాయిన్ అయ్యారు’ అని పేర్కొంది. గడచిన 7 సీజన్లలో ఆ జట్టు ఆరుగురు కోచ్‌లను మార్చడం గమనార్హం. కాగా పాంటింగ్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పనిచేశారు.