News August 16, 2024

వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు.. సెలవులకు దరఖాస్తు

image

AP: వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు వరుసగా సెలవులకు దరఖాస్తు చేసుకున్నారు. రోజూ ఉ.10 నుంచి సా.6 వరకు హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని, అటెండెన్స్ రిజిస్టర్‌లో వచ్చి వెళ్లేటప్పుడు సంతకాలు చేయాలని <<13850500>>16 మంది ఐపీఎస్‌లకు<<>> డీజీపీ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు.

Similar News

News January 21, 2025

పోలీసులకు కీలక ఆధారాలు.. 2PM తర్వాత సైఫ్ డిశ్చార్జి

image

క్రైమ్‌సీన్ రీక్రియేషన్‌తో యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడికేసులో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఫింగర్‌ప్రింట్స్‌ను వారు సేకరించారు. అతడు బాత్‌రూమ్ కిటీకి గుండా ఇంటిలోకి చొరబడినట్టు గుర్తించారు. కాగా మధ్యాహ్నం 2PM తర్వాత లీలావతీ ఆస్పత్రి నుంచి సైఫ్‌ డిశ్చార్జ్ అవుతారని తెలిసింది. దాడి జరిగిన బాంద్రా ఇంటికి కాకుండా ఫార్చూన్ హైట్స్ గృహానికి వెళ్తారని సమాచారం.

News January 21, 2025

ఇండియన్ జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉంటుందా?

image

ICC టోర్నీల సమయంలో హోస్ట్ నేషన్ పేరు మిగతా దేశాల జెర్సీలపై ఉంటుంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్థాన్ పేరును తమ జెర్సీపై ఉంచేందుకు భారత్ నిరాకరించినట్లు PCB తెలిపింది. ఈ విషయంలో ICC పాక్‌కు మద్దతు ఇవ్వాలని, జెర్సీపై పేరు పెట్టకపోవడాన్ని సమర్థించవద్దని PCB ప్రతినిధులు కోరారు. అలాగే టోర్నీ ప్రారంభ వేడుకకూ కెప్టెన్ రోహిత్‌ను తమ దేశానికి పంపాలని BCCI అనుకోవడం లేదని చెప్పారు.

News January 21, 2025

POSTER: కొత్త లుక్‌లో రష్మిక

image

ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఛావా’ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఇందులో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్యగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా రష్మిక లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. మహారాణిలా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.