News January 21, 2025
ఇండియన్ జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉంటుందా?

ICC టోర్నీల సమయంలో హోస్ట్ నేషన్ పేరు మిగతా దేశాల జెర్సీలపై ఉంటుంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్థాన్ పేరును తమ జెర్సీపై ఉంచేందుకు భారత్ నిరాకరించినట్లు PCB తెలిపింది. ఈ విషయంలో ICC పాక్‌కు మద్దతు ఇవ్వాలని, జెర్సీపై పేరు పెట్టకపోవడాన్ని సమర్థించవద్దని PCB ప్రతినిధులు కోరారు. అలాగే టోర్నీ ప్రారంభ వేడుకకూ కెప్టెన్ రోహిత్‌ను తమ దేశానికి పంపాలని BCCI అనుకోవడం లేదని చెప్పారు.
Similar News
News February 19, 2025
‘ఉప్పు’ ముప్పును దూరం చేసే టీస్పూన్!

ఉప్పు తినడాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్న వేళ జపాన్ సైంటిస్టులు ‘ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్’ను అభివృద్ధి చేశారు. ఏదైనా ఆహారంలో ఉప్పు వేయకున్నా ఆ రుచిని ఈ స్పూన్ మీకు అందిస్తుంది. ఇది తేలికపాటి విద్యుత్ ప్రవాహాన్ని పంపించి నాలుకలో ఉండే టేస్టింగ్ గ్రంథులను ఉత్తేజపరిచి ఉప్పు రుచిని అందిస్తాయి. దీనిని వాడటం వల్ల అధిక రక్తపోటు వంటి ప్రమాదాలను నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News February 19, 2025
మస్క్: నలుగురితో సంసారం, 13 మంది పిల్లలు

అపరకుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఏకంగా 13 మంది పిల్లలకు తండ్రి అని నేషనల్ మీడియా పేర్కొంది. ఆయన నలుగురితో సంసారం చేయగా, వారికి 13 మంది పిల్లలు కలిగినట్లు తెలిపింది. మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలు, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు ఉన్నారు.
News February 19, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

TG: పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. కేసు దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ (మార్చి 3) వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.