News August 16, 2024
‘మిస్టర్ బచ్చన్’ నిడివి తగ్గించాం: హరీశ్ శంకర్
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నిడివిని కాస్త తగ్గించినట్లు దర్శకుడు హరీశ్ శంకర్ తెలిపారు. మూవీలో వచ్చే హిందీ సాంగ్స్‌తో పాటు దాదాపు 13 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు పేర్కొన్నారు. పలువురి సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. అప్డేడేట్ ప్రింట్లు ఇవాళ రాత్రి నుంచి రన్ అవుతాయన్నారు. కాగా ఇవాళ రాత్రి ఆయన HYDలోని బాలానగర్ విమల్ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూస్తానన్నారు.
Similar News
News January 21, 2025
పోలీసులకు కీలక ఆధారాలు.. 2PM తర్వాత సైఫ్ డిశ్చార్జి
క్రైమ్‌సీన్ రీక్రియేషన్‌తో యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడికేసులో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఫింగర్‌ప్రింట్స్‌ను వారు సేకరించారు. అతడు బాత్‌రూమ్ కిటీకి గుండా ఇంటిలోకి చొరబడినట్టు గుర్తించారు. కాగా మధ్యాహ్నం 2PM తర్వాత లీలావతీ ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జ్ అవుతారని తెలిసింది. దాడి జరిగిన బాంద్రా ఇంటికి కాకుండా ఫార్చూన్ హైట్స్ గృహానికి వెళ్తారని సమాచారం.
News January 21, 2025
ఇండియన్ జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉంటుందా?
ICC టోర్నీల సమయంలో హోస్ట్ నేషన్ పేరు మిగతా దేశాల జెర్సీలపై ఉంటుంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్థాన్ పేరును తమ జెర్సీపై ఉంచేందుకు భారత్ నిరాకరించినట్లు PCB తెలిపింది. ఈ విషయంలో ICC పాక్‌కు మద్దతు ఇవ్వాలని, జెర్సీపై పేరు పెట్టకపోవడాన్ని సమర్థించవద్దని PCB ప్రతినిధులు కోరారు. అలాగే టోర్నీ ప్రారంభ వేడుకకూ కెప్టెన్ రోహిత్‌ను తమ దేశానికి పంపాలని BCCI అనుకోవడం లేదని చెప్పారు.
News January 21, 2025
POSTER: కొత్త లుక్‌లో రష్మిక
ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఛావా’ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఇందులో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్యగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా రష్మిక లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. మహారాణిలా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.