News August 17, 2024
27న ఈ-క్యాబినెట్ భేటీ
AP: ఈ నెల 27న సచివాలయంలో ఈ-క్యాబినెట్ భేటీ జరుగుతుందని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాబ్‌ల ద్వారా క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భేటీకి సంబంధించిన అంశాలను ఈ నెల 23లోగా సాధారణ పరిపాలనశాఖకు పంపాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 21, 2025
ట్రంప్ గారూ.. మరోసారి ఆలోచించండి: WHO
WHO నుంచి <<15210852>>తప్పుకుంటున్నట్లు<<>> ట్రంప్ ప్రకటించడంపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మంది ఆరోగ్యం కోసం WHO, USA కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 1.4 బిలియన్ల జనాభా ఉన్న చైనా WHOకు 39 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంటే తాము 500 మి.డా. చెల్లిస్తున్నామని ట్రంప్ అంతకుముందు చెప్పారు.
News January 21, 2025
IT దాడులపై స్పందించిన దిల్ రాజు భార్య
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. దీనిపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. ‘సినిమా నిర్మాణాలకు సంబంధించే మా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న పలు రికార్డులు పరిశీలించారు. ఐటీ అధికారులకు బ్యాంకు వివరాలు ఇచ్చాం. బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
News January 21, 2025
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించొద్దు: జనసేన
AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఎవరూ స్పందించవద్దని జనసైనికులకు జనసేన పార్టీ ఆదేశించింది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ దీనిపై ఎవరూ మాట్లాడవద్దని సూచించింది. కాగా ఇదే అంశంపై నిన్న టీడీపీ అధిష్ఠానం కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది.