News January 21, 2025
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించొద్దు: జనసేన

AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఎవరూ స్పందించవద్దని జనసైనికులకు జనసేన పార్టీ ఆదేశించింది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ దీనిపై ఎవరూ మాట్లాడవద్దని సూచించింది. కాగా ఇదే అంశంపై నిన్న టీడీపీ అధిష్ఠానం కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది.
Similar News
News February 17, 2025
రూ.15 కోట్లు పెట్టి ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కొన్నాడు!

ఖరీదైన కారుకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండాలని చాలా మందికి ఉంటుంది. దానికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు కొందరు వెనకాడరు. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా HK$14.2 మిలియన్లు (రూ.15.83 కోట్లు) పెట్టి అరుదైన సింగిల్-లెటర్ రిజిస్ట్రేషన్ మార్క్ ‘S’ను కొనుగోలు చేశారు. ఇది హాంకాంగ్ దేశంలో రవాణా శాఖ నిర్వహించిన వేలంలో జరిగింది. అలాగే ‘88’ అనే నంబర్ ప్లేట్‌ను HK$11 మిలియన్లకు (రూ.12 కోట్లు) మరో వ్యక్తి దక్కించుకున్నారు.
News February 17, 2025
కేజీహెచ్‌లో GBS మరణం? కొట్టిపారేసిన సూపరింటెండ్

AP: విశాఖపట్నం కేజీహెచ్‌లో GBSతో ఓ మహిళ మృతి చెందిందన్న ప్రచారాన్ని ఆసుపత్రి సూపరింటెండ్ శివానందం కొట్టిపారేశారు. ఇప్పటివరకు ఐదు అనుమానిత కేసులు నమోదయ్యాయని, ఎవరూ మరణించలేదని చెప్పారు. ఇది అంటువ్యాధి కాదని వెల్లడించారు. కాగా ఛాతిలో నొప్పితో ఎల్.కోట మండలం మల్లివీడుకు చెందిన రేణుకా మహంతి ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వార్తలొచ్చాయి.
News February 17, 2025
ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ: సీఎం

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లను పరిశీలించారు.