News August 17, 2024
నాలాలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబాన్ని కాపాడిన పోలీసులు

TG: హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఈ క్రమంలో వనస్థలిపురంలోని ఓ నాలాలోకి కారు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అందులోని ముగ్గురు చిన్నారులు, వారి తల్లిదండ్రులను కాపాడారు. దీంతో పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
Similar News
News January 13, 2026
పాదాల అందం కోసం

మన శరీరంలోనే భాగమైన పాదాల సంరక్షణను అంతగా పట్టించుకోం. దీని వల్ల మడమలకు పగుళ్లు వచ్చి తీవ్రంగా బాధిస్తాయి కూడా. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. * పాదాల పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది. * ఓట్‌మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.
News January 13, 2026
భోగి మంటల్లో ఏం వేయాలి? ఏం వేయకూడదంటే?

భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్, రబ్బర్, టైర్లను వేయకూడదు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఆ విషపూరిత పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆవు పిడకలు, ఔషధ గుణాలున్న కట్టెలు వేయాలి. ఇలాంటి హానికరమైన పదార్థాలను వాడటం శ్రేయస్కరం కాదు. పర్యావరణాన్ని కాపాడుతూ, మన ఆరోగ్యానికి భంగం కలగకుండా భోగి వేడుకలను జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News January 13, 2026
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 84,038 వద్ద.. నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 25,836 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఎటర్నల్, టెక్ మహీంద్రా, SBI, BEL, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో.. ఎల్ అండ్ టీ, TCS, రిలయన్స్, M&M, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.


