News August 17, 2024
నాలాలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబాన్ని కాపాడిన పోలీసులు
TG: హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఈ క్రమంలో వనస్థలిపురంలోని ఓ నాలాలోకి కారు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అందులోని ముగ్గురు చిన్నారులు, వారి తల్లిదండ్రులను కాపాడారు. దీంతో పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
Similar News
News September 15, 2024
వారికి కోరుకున్న చోట స్థలాలిస్తాం: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములిచ్చిన రైతుల నుంచి స్వయంగా అంగీకార పత్రాలు తీసుకున్నారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వచ్చి భూములు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే వారికి కోరుకున్న చోట స్థలాలిస్తామని తెలిపారు. ఐఐటీ రిపోర్ట్ ఆధారంగా రాజధాని నిర్మాణ పనులు చేపడతామన్నారు.
News September 15, 2024
రేవంత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు: హరీశ్
TG: అరెకపూడి గాంధీ కాంగ్రెస్ MLA అని CM రేవంత్ ఇవాళ తన వ్యాఖ్యలతో ఒప్పుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘మనోళ్లే వాళ్లింటికి వెళ్లి తన్నారని రేవంత్ అన్నారు. అంటే గాంధీ వాళ్లోడే అన్నట్టుగా. సీఎం మాటలు చూస్తుంటే తానే దాడి చేయించానని చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. మళ్లీ పైనుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.
News September 15, 2024
నిఫా వైరస్‌తో కేరళలో వ్యక్తి మృతి
నిఫా వైరస్ కారణంగా కేరళలో ఓ వ్యక్తి మరణించారు. మళప్పురం జిల్లాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆ వ్యక్తి సెప్టెంబర్ 9వ తేదీన మృతి చెందినట్లు పేర్కొన్నారు. మరణం తర్వాత పరీక్షల్లో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. మృతుడితో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లని గుర్తించి అనుమానిత లక్షణాలు ఉన్న ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు.