News August 17, 2024
ఈ సమయంలో రాఖీ కట్టకూడదు!

ఆగస్టు 19న (సోమవారం) రాఖీ పండుగ జరుపుకోనున్నారు. పౌర్ణమి తిథి ఆ రోజు తెల్లవారుజామున 3.04 గంటలకు ప్రారంభమై రా.11.55 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ మధ్యలో భద్రకాలం ఉ.5.53 నుంచి మ.1.32 గంటల వరకు ఉంటుందని, శాస్త్ర ప్రకారం భద్రకాలంలో సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని పండితులు చెబుతున్నారు. అది ముగిశాకే మ.1.33 గంటల నుంచి రా.9.08 గంటల వరకు శుభ సమయంలో కట్టాలని సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News January 15, 2026
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

<
News January 15, 2026
రేపు ఈ పనులు చేస్తే సకల శుభాలు..

కనుమ రోజున పశువులను పూజించి, గ్రామ దేవతలను దర్శించి వారికి పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని, సిరిసంపదలు సొంతమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవాలి. పితృదేవతలను స్మరించుకోవాలి. పిండి వంటల నైవేద్యాలు పెట్టాలి. మద్యానికి దూరముండాలి. ఈ నియమాలు పాటిస్తే కుటుంబానికి, పశుసంపదకు మేలు జరగడమే కాకుండా వాటి నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది’ అంటున్నారు.
News January 15, 2026
సంక్రాంతికి విడుదల.. ఏ సినిమాకు వెళ్లారు?

సంక్రాంతి అనగానే సినిమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. పండగ వేళ ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి 5 సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘MSVPG’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ జాబితాలో ఉన్నాయి. మీరు వీటిలో ఏ సినిమాకు వెళ్లారు? ఏ మూవీ నచ్చింది?


