News August 17, 2024

ఈ సమయంలో రాఖీ కట్టకూడదు!

image

ఆగస్టు 19న (సోమవారం) రాఖీ పండుగ జరుపుకోనున్నారు. పౌర్ణమి తిథి ఆ రోజు తెల్లవారుజామున 3.04 గంటలకు ప్రారంభమై రా.11.55 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ మధ్యలో భద్రకాలం ఉ.5.53 నుంచి మ.1.32 గంటల వరకు ఉంటుందని, శాస్త్ర ప్రకారం భద్రకాలంలో సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని పండితులు చెబుతున్నారు. అది ముగిశాకే మ.1.33 గంటల నుంచి రా.9.08 గంటల వరకు శుభ సమయంలో కట్టాలని సూచిస్తున్నారు.
SHARE IT

Similar News

News September 11, 2024

దొంగలకు షాక్.. ఇద్దరు మృతి

image

TG: దొంగతనానికి వెళ్లిన ఇద్దరు కరెంట్ షాక్‌తో మృతి చెందిన ఘటన MBNR జిల్లా మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయిన్‌పల్లిలోని సోలార్ ప్లాంట్‌లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో కంచెకు కరెంట్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి చోరీకి వచ్చిన ఇద్దరు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

News September 11, 2024

భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి కానుందా?

image

TG: చెరువులు, నాలాలకు సమీపంలో భవనాల నిర్మాణాలకు ‘హైడ్రా’ అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది. హైడ్రా నుంచి NOC ఉంటేనే నిర్మాణాలు చేపట్టేలా నిబంధనలను సవరించనున్నట్లు సమాచారం. ఒకవేళ అక్రమంగా నిర్మిస్తే ఇంటి నంబర్, నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరని అధికార వర్గాలు చెబుతున్నాయి.

News September 11, 2024

విశాఖకు మరో వందేభారత్

image

విశాఖ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా SEP 15 నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి దుర్గ్(ఛత్తీస్‌గఢ్)కు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది. ఉ.6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి రాయ్‌పూర్, మహాసముంద్, రాయగడ, విజయనగరం మీదుగా మ.1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మ.2.55 గం.కు బయల్దేరి రా.10.50 గం.కు దుర్గ్ చేరుకుంటుంది.