News August 18, 2024

రూ.100 కోట్లు చేతులు మారాయి: చింతా మోహన్

image

AP: టీటీడీలో 6 నెలల క్రితం రూ.100 కోట్లు చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. సత్రాల నిర్మాణం కోసం రూ.1200 కోట్లకు ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని వెల్లడించారు. భక్తుల హుండీ సొమ్మును ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఘటనపై అనుమానాలు నెలకొన్నాయని, దీనిపై ఈవో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 22, 2025

అమెరికా నుంచి 18000 మంది వెనక్కి!

image

డొనాల్డ్ ట్రంప్ పాలసీలకు తగినట్టు భారత్ ప్రణాళికలు వేసుకుంటోంది. USతో అనవసరంగా ట్రేడ్‌వార్ తెచ్చుకోకుండా ఉండేందుకు 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. 2 దేశాలూ కలిసి వీరిని గుర్తించాయి. స్టూడెంట్, వర్క్ వీసాలతో లీగల్‌గా అక్కడికి వెళ్లినవారికి అడ్డంకులు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లేదంటే వీసాలు, గ్రీన్‌కార్డులు తగ్గించి ట్రంప్ తిప్పలు పెట్టొచ్చు.

News January 22, 2025

రిలేషన్‌కు బ్రేకప్ చెబుతారనే సంకేతాలు ఇవి..

image

సైకాలజిస్టుల ప్రకారం మీతో రిలేషన్‌ను మీ పార్ట్నర్ ముగించాలని డిసైడ్ అయితే ఇలా తెలుస్తుంది
– ఒకప్పటిలా మీతో సన్నిహితంగా ఉండకపోవడం/ సరిగా స్పందించకపోవడం/ కారణాలు ఎక్కువ చెప్పడం/ గొడవలు పెరగడం/కేరింగ్ & షేరింగ్ తగ్గడం
– తనతో ఫ్యూచర్ గురించి చెబితే అనాసక్తి చూపడం
– క్లోజ్ రిలేషన్ కాకుండా ఫార్మల్‌గా ఉండటం
– మరొకరితో పోల్చడం, ఇతరుల గురించి మాట్లాడటం
– ప్రతి విషయాన్ని గుచ్చి చూడటం, లెక్కగట్టడం

News January 22, 2025

టీమ్ఇండియా వికెట్ టేకర్‌ను ఫినిష్ చేసిన BCCI: ఆకాశ్ చోప్రా

image

యుజ్వేంద్ర చాహల్ పనైపోయినట్టేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. CT సిరీసుకు ఎంపిక చేయకపోవడం ద్వారా BCCI, టీమ్ మేనేజ్‌మెంట్ అతడి కథను ముగించిందని పేర్కొన్నారు. వికెట్లు తీస్తున్నప్పటికీ రెండేళ్ల క్రితమే అతడిని వన్డేల నుంచి తప్పించారని గుర్తుచేశారు. ‘దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంతో పొట్టి ఫార్మాట్లోనూ ఎంపిక చేయడం లేదు. ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ అతడిని ఎంపిక చేస్తే తిరోగమన చర్యే అవుతుంది’ అన్నారు.