News August 18, 2024

ఖర్గే, రాహుల్‌కు కేటీఆర్ లేఖ

image

TG: రైతులను కాంగ్రెస్ రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి మాజీ మంత్రి KTR లేఖ రాశారు. రుణమాఫీ మోసంతో లక్షలాది మంది రైతులు ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. కనీసం 40శాతం మందికి రుణమాఫీ చేయకుండానే 100% పూర్తయిందని ప్రకటించడం దౌర్భాగ్యమన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అన్నదాతల పక్షాన ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల తరఫున పోరాడుతామని హెచ్చరించారు.

Similar News

News January 30, 2026

MMRCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>MMRCL<<>>) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.mmrcl.com

News January 30, 2026

ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే

image

1.కింగ్ ఫాద్ (దమ్మామ్, సౌదీ): 776 చ.కి.మీ విస్తీర్ణం. ముంబై సిటీ కంటే పెద్దది.
2.డెన్వర్ (అమెరికా): 137.8 చ.కి.మీ. 16వేల అడుగుల పొడవైన రన్ వే ఉంటుంది.
3.కౌలాలంపూర్ (మలేషియా): 100 చ.కి.మీ. ‘ఎయిర్‌పోర్ట్ ఇన్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. ప్రపంచంలో అతి ఎత్తైన ATC (133.8 మీటర్లు) ఇక్కడే ఉంది.
4.ఇస్తాంబుల్ (తుర్కియే): 76.5 చ.కి.మీ.
5.డల్లాస్ (అమెరికా): 69.7 చ.KM.
>టాప్-10లో భారత విమానాశ్రయాలు లేవు.

News January 30, 2026

బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్?

image

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సీనియర్‌ సిటిజన్లకు కేంద్రం గుడ్‌ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి అమలు చేయాలనే ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖలు చర్చలు జరుపుతున్నాయి. దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే ఆరేళ్ల తర్వాత వృద్ధులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేయనున్నారు. గతంలో పురుషులకు 40%, మహిళలకు 50% రాయితీ ఉండేది.