News August 18, 2024

ఖర్గే, రాహుల్‌కు కేటీఆర్ లేఖ

image

TG: రైతులను కాంగ్రెస్ రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి మాజీ మంత్రి KTR లేఖ రాశారు. రుణమాఫీ మోసంతో లక్షలాది మంది రైతులు ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. కనీసం 40శాతం మందికి రుణమాఫీ చేయకుండానే 100% పూర్తయిందని ప్రకటించడం దౌర్భాగ్యమన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అన్నదాతల పక్షాన ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల తరఫున పోరాడుతామని హెచ్చరించారు.

Similar News

News September 15, 2024

నిఫా వైరస్‌తో కేరళలో వ్యక్తి మృతి

image

నిఫా వైరస్ కారణంగా కేరళలో ఓ వ్యక్తి మరణించారు. మళప్పురం జిల్లాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆ వ్యక్తి సెప్టెంబర్ 9వ తేదీన మృతి చెందినట్లు పేర్కొన్నారు. మరణం తర్వాత పరీక్షల్లో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. మృతుడితో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లని గుర్తించి అనుమానిత లక్షణాలు ఉన్న ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు.

News September 15, 2024

అల్లు అర్జున్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి గిఫ్ట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఓ బహుమతి పంపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని బన్నీ వెల్లడించారు. ‘ఎవరో తెలీదు కానీ నాకు ఈ పుస్తకాన్ని గిఫ్ట్‌గా పంపించారు. అతడి నిజాయితీ నా హృదయాన్ని తాకింది. నాకు పుస్తకాలంటే ఇష్టం. ఇక ఈ బుక్ రాసిన సీకే ఒబెరాన్‌కు ఆల్‌ ది బెస్ట్’ అని ఇన్‌స్టా స్టోరీ పెట్టారు. దీంతో ఆ అభిమాని ఎవరా అంటూ ఆయన ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

News September 15, 2024

రేవంత్.. నీ గుండెల్లో నిద్రపోతా: హరీశ్

image

TG: రుణమాఫీ అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వదలిపెట్టనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తాను ఎక్కడా దాక్కోలేదని, అనుక్షణం రుణమాఫీని గుర్తు చేస్తూ మిగతాది చేసే వరకు గుండెల్లో నిద్రపోతానని చెప్పారు. వడ్లకు బోనస్ ఇస్తానని బోగస్‌గా మార్చిన సన్నాసి ఎవరని ప్రశ్నించారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే పూర్తిగా రుణమాఫీ జరగలేదని, దీనిపై చర్చకు సిద్ధమా అని రేవంత్‌కు సవాల్ విసిరారు.