News August 19, 2024

ఆగస్టు 19: చరిత్రలో ఈరోజు

image

14 AD: రోమన్ చక్రవర్తి ఆగస్టస్ మరణం
1918: దివంగత మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ జననం
1919: బ్రిటన్ నుంచి అఫ్గానిస్థాన్‌కు స్వాతంత్ర్యం
1925: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య జననం
1972: నటుడు మురళీ శర్మ జననం
1991: కుప్పకూలిన సోవియట్ యూనియన్
2016: రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధుకు తొలి రజత పతకం
* ఈరోజు రాఖీ పౌర్ణమి
* వరల్డ్ ఫొటోగ్రఫీ డే

Similar News

News January 22, 2025

‘గోల్డ్ రా మన తమన్ అన్న’

image

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇస్తుంటారు. తాజాగా ఓ యువకుడు తన బాధను తమన్ దృష్టికి తీసుకెళ్లగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తాను ఓ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ అని, అది పాడైపోయిందని చెప్పడంతో కొత్తది కొనిస్తానని హామీ ఇచ్చారు. వివరాలు చెప్పాలని కోరారు. దీంతో తమన్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తమన్ గోల్డ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News January 22, 2025

జియో, AirTel వాడుతున్నారా?

image

ఇంటర్నెట్ వాడని యూజర్లకు ఖర్చు తగ్గించేందుకు కాల్స్, SMSల కోసం ప్రత్యేక ప్లాన్లు తేవాలని ట్రాయ్ చెప్తే టెలికం కంపెనీలు మాత్రం తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాన్లలో డేటా కట్ చేసి రేట్లు అలాగే ఉంచాయి. డేటా ఉండే రూ.479 ప్యాక్ ధరను జియో రూ.60 పెంచి రూ.539గా నిర్ణయించింది. రూ.1,999 ప్లాన్ ధరను రూ.350 పెంచి రూ.2,249 చేసింది. అటు AirTel సైతం డేటా తొలగించి, ప్లాన్ రేట్లను పెంచింది.

News January 22, 2025

గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఏపీ: నారా లోకేశ్

image

AP: రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మారుస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దావోస్‌లో విద్యారంగ గవర్నర్ల భేటీలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 3 AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మధ్యంతర బడ్జెట్‌లో రూ.255 కోట్లు కేటాయించాం. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం’ అని చెప్పారు. APలో ఐటీ కార్యకలాపాలను ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ను కోరారు.