News January 22, 2025
జియో, AirTel వాడుతున్నారా?

ఇంటర్నెట్ వాడని యూజర్లకు ఖర్చు తగ్గించేందుకు కాల్స్, SMSల కోసం ప్రత్యేక ప్లాన్లు తేవాలని ట్రాయ్ చెప్తే టెలికం కంపెనీలు మాత్రం తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాన్లలో డేటా కట్ చేసి రేట్లు అలాగే ఉంచాయి. డేటా ఉండే రూ.479 ప్యాక్ ధరను జియో రూ.60 పెంచి రూ.539గా నిర్ణయించింది. రూ.1,999 ప్లాన్ ధరను రూ.350 పెంచి రూ.2,249 చేసింది. అటు AirTel సైతం డేటా తొలగించి, ప్లాన్ రేట్లను పెంచింది.
Similar News
News February 16, 2025
మహారాష్ట్రలో లవ్ జిహాద్ నియంత్రణకు చట్టం!

బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ నియంత్రణ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు ఏడుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. DGP అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో న్యాయ, శిశు, మైనార్టీ, సామాజిక శాఖల సెక్రటరీలు, హోంశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. లవ్ జిహాద్‌ను అరికట్టడానికి ఏం చేయాలన్నదానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
News February 16, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

బర్డ్ ఫ్లూతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నా ధరల్లో పెద్దగా మార్పు లేదు. గత వారం కేజీ చికెన్ రూ.220-240 ఉండగా, ఇప్పుడు రూ.200-220 పలుకుతోంది. HYD, విశాఖలో స్కిన్ లెస్ కేజీ రూ.200, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160 ఉంది. వైరస్ సోకిన కోళ్లను తినొద్దని, సోకని కోడి మాంసాన్ని 70-100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీరు చికెన్ తింటున్నారా? ధర ఎంత? కామెంట్ చేయండి.
News February 16, 2025
రద్దీ నియంత్రణకు మెరుగైన వ్యవస్థ అవసరం: కేటీఆర్

TG: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన <<15476388>>తొక్కిసలాట ఘటనలో<<>> మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో రద్దీ నియంత్రణకు మెరుగైన వ్యవస్థ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.