News August 19, 2024

కోల్‌కతా ఘటన.. సూర్యకుమార్ ఎమోషనల్ పోస్ట్

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో భారత T20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రొటెక్ట్ యువర్ అని డాటర్ అని కాకుండా ‘మీ కొడుకుని, సోదరులను, తండ్రిని, భర్తని, స్నేహితులను ఎడ్యుకేట్ చేయండి’ అని ఉన్న పోస్ట్‌ను పంచుకున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు ఈ ఘటనపై స్పందించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 22, 2025

జియో, AirTel వాడుతున్నారా?

image

ఇంటర్నెట్ వాడని యూజర్లకు ఖర్చు తగ్గించేందుకు కాల్స్, SMSల కోసం ప్రత్యేక ప్లాన్లు తేవాలని ట్రాయ్ చెప్తే టెలికం కంపెనీలు మాత్రం తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాన్లలో డేటా కట్ చేసి రేట్లు అలాగే ఉంచాయి. డేటా ఉండే రూ.479 ప్యాక్ ధరను జియో రూ.60 పెంచి రూ.539గా నిర్ణయించింది. రూ.1,999 ప్లాన్ ధరను రూ.350 పెంచి రూ.2,249 చేసింది. అటు AirTel సైతం డేటా తొలగించి, ప్లాన్ రేట్లను పెంచింది.

News January 22, 2025

గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఏపీ: నారా లోకేశ్

image

AP: రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మారుస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దావోస్‌లో విద్యారంగ గవర్నర్ల భేటీలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 3 AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మధ్యంతర బడ్జెట్‌లో రూ.255 కోట్లు కేటాయించాం. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం’ అని చెప్పారు. APలో ఐటీ కార్యకలాపాలను ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ను కోరారు.

News January 22, 2025

ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం కోసం ఎదురుచూపు

image

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డుంకీ’లో నటించిన వరుణ్ కులకర్ణి తీవ్ర కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తోటి నటుడు రోషన్ శెట్టి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వరుణ్ వైద్య ఖర్చులను సైతం భరించలేని స్థితిలో ఉన్నాడని తెలుపుతూ ఇండస్ట్రీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరుణ్ ‘స్కామ్ 1992’ & ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (ప్రైమ్ వీడియో) వంటి సిరీస్‌లలో కనిపించారు.