News August 19, 2024
రాఖీకి సాధారణ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి

TG: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో కొన్ని స్కూళ్లు సెలవు ఇవ్వగా, మరికొన్ని హాలిడే ఇవ్వలేదు. బాలికలు, ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే రాఖీపండుగకు సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే కూడా లేదు.
Similar News
News July 8, 2025
మూడ్రోజుల్లో రైతులకు ధాన్యం కొనుగోలు నగదు: మార్క్‌ఫెడ్

AP: రైతులకు మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు శుభవార్త చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వ హామీతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(NCDC) నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం పొందేందుకు మార్క్‌ఫెడ్‌కు అనుమతి లభించింది. రుణం అందగానే ధాన్యం సేకరించిన పౌర సరఫరాల సంస్థకు నగదు బదిలీ చేస్తాం. తద్వారా పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపులు వెనువెంటనే చేస్తుంది’ ఆయన పేర్కొన్నారు.
News July 8, 2025
దాల్చిన చెక్క నీళ్లతో ఎన్ని లాభాలంటే?

దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే తాగితే మంచి లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు నీటిలో ఒక దాల్చిన చెక్క ముక్క వేసి 15-20 నిమిషాలు మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా తాగాలి. అది జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
News July 8, 2025
అడ్వాన్స్డ్ ఫీచర్లతో GROK 4.. జులై 8న రిలీజ్

xAI ఆవిష్కరించిన AI చాట్ బాట్ GROKలో కొత్త వర్షన్ రాబోతోంది. GROK 4 కొత్త రిలీజ్ డేట్‌ను ఎలాన్ మస్క్ ప్రకటించారు. జులై 4న జరగాల్సిన ఈ రిలీజ్ బుధవారం(జులై9)కి వాయిదా పడింది. రా.8 గంటలకు రిలీజ్ లైవ్ స్ట్రీమ్ ఉంటుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇది ఓ స్పెషలైజ్డ్ కోడింగ్ మోడల్. డెవలపర్స్ కోసం కోడింగ్ ఆటో కంప్లీషన్, డీబగ్గింగ్, IDE ఇంటిగ్రేషన్ ఉంటుంది. రియల్‌టైమ్ డేటా, మల్టీ మోడల్ సపోర్టింగ్ కూడా ఉంటుంది.