News August 19, 2024
రాఖీకి సాధారణ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి
TG: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో కొన్ని స్కూళ్లు సెలవు ఇవ్వగా, మరికొన్ని హాలిడే ఇవ్వలేదు. బాలికలు, ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే రాఖీపండుగకు సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే కూడా లేదు.
Similar News
News September 17, 2024
జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలికి అల్లు అర్జున్ భరోసా?
జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలికి అండగా నిలిచేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. బాధితురాలికి తాను నటించే, గీతా ఆర్ట్స్ నిర్మించే అన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని ప్రకటించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఇప్పటికే ‘పుష్ప-2’లోనూ పని చేస్తున్నారని టాక్. తెలుగు అమ్మాయిలు పరిశ్రమలోకి రావాలని ‘బేబీ’ మూవీ సక్సెస్ మీట్‌లో బన్నీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
News September 17, 2024
మహేశ్-రాజమౌళి మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి SSMB29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన పోస్ట్ వైరలవుతోంది. ఇందులో స్టోరీ-విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ-P.S. వినోద్ అని రాసి ఉంది. కాగా దసరాకు షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News September 17, 2024
‘మ్యాడ్’ సీక్వెల్‌పై రేపే అప్డేట్
నార్నె నితిన్ హీరోగా సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ‘మ్యాడ్ మ్యాక్స్‌తో బాయ్స్ మళ్లీ రాబోతున్నారు’ అని పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ‘మ్యాడ్’ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.