News August 19, 2024
సీఎంను అవమానించిన 11 మందిపై కేసు

TG: సీఎం రేవంత్ రెడ్డిని అవమానిస్తూ ఆదిలాబాద్(D) రుయ్యాడిలో ఆందోళన చేసిన 11 మంది బీఆర్ఎస్ నాయకులు, రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రుణమాఫీ అమలు కాలేదంటూ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. సీఎం శవయాత్ర పేరిట నిరసన చేపట్టారు. దీంతో సీఎంను కించపరిచేలా వ్యవహరించడం అప్రజాస్వామికమని వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాగే కొనసాగితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Similar News
News January 16, 2026
ట్రంప్ కొంతైనా ‘శాంతి’స్తారా?

అధికారికంగా కాకపోయినా ట్రంప్ చేతికి <<18868941>>నోబెల్ పీస్ ప్రైజ్<<>> అందింది. దీంతో కొంతైనా శాంతించి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మచాడో వెనిజులా అధ్యక్షురాలు అవుతారని కొందరు, ఆమెకు ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవాలని మరికొందరు స్పందిస్తున్నారు. కాగా తనకు కాకుండా వెనిజులాకు చెందిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రావడంతోనే ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని ట్రంప్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి.
News January 16, 2026
ముంబై పీఠం ఎవరిది.. నేడే కౌంటింగ్

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు నేడు 10am నుంచి వెలువడనున్నాయి. మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 46-50% పోలింగ్ నమోదైనట్లు EC తెలిపింది. BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని <<18867305>>ఎగ్జిట్ పోల్స్<<>> అంచనా వేశాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 114 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
News January 16, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

బరక్‌పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<


