News August 19, 2024

సీఎంను అవమానించిన 11 మందిపై కేసు

image

TG: సీఎం రేవంత్ రెడ్డిని అవమానిస్తూ ఆదిలాబాద్(D) రుయ్యాడిలో ఆందోళన చేసిన 11 మంది బీఆర్ఎస్ నాయకులు, రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రుణమాఫీ అమలు కాలేదంటూ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. సీఎం శవయాత్ర పేరిట నిరసన చేపట్టారు. దీంతో సీఎంను కించపరిచేలా వ్యవహరించడం అప్రజాస్వామికమని వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాగే కొనసాగితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Similar News

News September 14, 2024

అప్పుల ఊబిలో మాల్దీవులు.. చైనాతో కీలక ఒప్పందం

image

పొరుగుదేశం మాల్దీవులు అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆ దేశం చైనా నుంచి మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తమ మిత్ర దేశం మాల్దీవులకు తాము ఎలాంటి సహకారమైనా అందిస్తామని చైనా ప్రకటించింది. కాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు త్వరలో భారత్ పర్యటనకు రానున్న క్రమంలో ఈ అగ్రిమెంట్ జరగడం చర్చనీయాంశంగా మారింది.

News September 14, 2024

కోహ్లీతో పోరాటం కోసం ఎదురుచూస్తున్నా: స్టార్క్

image

ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీకి బౌలింగ్ వేసేందుకు ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అన్నారు. విరాట్‌తో పోరాటం బాగుంటుందన్నారు. ‘మేమిద్దరం ఒకరితో ఒకరు చాలా క్రికెట్ ఆడాం. మా పోరాటంలో ఉండే మజాను ఆస్వాదిస్తుంటాను. తను నాపై రన్స్ చేశారు. నేనూ ఆయన్ను ఔట్ చేశాను. ఈసారి పోరు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.

News September 14, 2024

గుజరాత్‌లో తీవ్ర విషాదం

image

గుజరాత్‌లోని దేగాం తాలూకాలో జరిగిన వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు నీటిలో మునిగి చనిపోయారు. వస్నా సోగ్తికి చెందిన కొందరు యువకులు గణేషుడిని నిమజ్జనం చేసేందుకు మాషో నదికి వెళ్లారు. నిమజ్జనం అనంతరం ఓ యువకుడు ఈత కొడుతూ మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ఒకరి తర్వాత మరొకరు నీటిలో దూకి మునిగిపోయారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.