News August 19, 2024
OCT 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. 4న ధ్వజారోహణం, పెద్దశేష వాహనం, 5న చిన్నశేష వాహనం, హంస వాహనం, 6న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 7న కల్పవృక్ష వాహనం, భూపాల వాహనం, 8న మోహినీ అవతారం, గరుడ వాహనం, 9న స్వర్ణ రథం, గజ వాహనం, 10న సూర్యప్రభ వాహనం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటుందని తెలిపింది.
Similar News
News December 28, 2025
‘మా డాడీ ఎవరో తెలుసా?’ అని చెప్పొద్దు.. సజ్జనార్ వార్నింగ్

TG: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని HYD సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అన్న ఎవరో తెలుసా? అని మా అధికారులను అడగొద్దు. మీ ప్రైవసీకి మర్యాద ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News December 28, 2025
శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

శీతాకాలంలో ఇమ్యునిటీ తగ్గడం వల్ల రోగాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజూ వ్యాయామం, ఉదయం లేచి ఒక గ్లాసు వేడినీరు తాగడం మంచిది. రోజుకు కనీసం 15 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవాలి. క్యారెట్, బంగాళాదుంప, చిలకడదుంప , పాలకూర, మెంతి కూర, నారింజ, దానిమ్మ, యాపిల్, తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, బాదం, వాల్నట్స్ ఆహారంలో చేర్చుకోవాలి.
News December 28, 2025
ఇల్లాలి నోటి నుంచి రాకూడని మాటలివే..

ఇల్లాలిని ‘గృహలక్ష్మి’గా భావిస్తారు. ఆమె మాట్లాడే మాటలు ఇంటి వాతావరణాన్ని, ఐశ్వర్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆమె నోటి నుంచి ఎప్పుడూ పీడ, దరిద్రం, శని, పీనుగ, కష్టం వంటి అమంగళకరమైన పదాలు రాకూడదు. వాటిని పదే పదే ఉచ్చరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి తగ్గి, లక్ష్మీదేవి కటాక్షం లోపిస్తుందని చెబుతారు. శుభకర మాటల వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సానుకూల పదాలను వాడటం వల్ల ఆ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది.


