News August 19, 2024

OCT 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. 4న ధ్వజారోహణం, పెద్దశేష వాహనం, 5న చిన్నశేష వాహనం, హంస వాహనం, 6న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 7న కల్పవృక్ష వాహనం, భూపాల వాహనం, 8న మోహినీ అవతారం, గరుడ వాహనం, 9న స్వర్ణ రథం, గజ వాహనం, 10న సూర్యప్రభ వాహనం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటుందని తెలిపింది.

Similar News

News September 12, 2024

మంగళగిరి నివాసమే క్యాంపు ఆఫీస్.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

image

AP: విజయవాడలో తన క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంపై విమర్శలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మంగళగిరిలోని తన నివాసాన్నే క్యాంపు ఆఫీసుగా వాడుకోనున్నారు. పాత ఆఫీసును, అందులోని ఫర్నిచర్‌ను వెనక్కు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో విశాలమైన భవనాన్ని కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

News September 12, 2024

మీ ఇంటి వద్ద జరిగినదానికి సారీ మాల్వీ: రాజ్ తరుణ్

image

ముంబైలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా నివాసం వద్ద నటుడు రాజ్ తరుణ్ ఉన్న సమయంలో లావణ్య అక్కడికి వెళ్లి ఆయన్ను అప్పగించాలంటూ హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్వీకి రాజ్‌తరుణ్ ట్విటర్‌లో సారీ చెప్పారు. ‘ముంబైలో మీ ఇంటివద్ద జరిగినదానికి చాలా సిగ్గుపడుతున్నాను మాల్వీ. సారీ. కానీ మీ ఫ్రెండ్స్‌తో కలిసి వినాయక చవితిని బాగా జరుపుకొన్నాం. గణేశుడి దీవెనలు మీకు ఉండాలి’ అని ట్వీట్ చేశారు.

News September 12, 2024

రేపు పిఠాపురంలో YS జగన్ పర్యటన

image

AP: మాజీ సీఎం YS జగన్ రేపు కాకినాడ జిల్లా పిఠాపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణక్కపేటలోని వరద బాధితులను పరామర్శిస్తారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.