News August 19, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహోర్‌లోనే: నఖ్వీ

వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆ దేశానికి వెళ్లడంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ట్రోఫీ ఫైనల్‌ను లాహోర్ గడాఫీ స్టేడియంలోనే నిర్వహిస్తామని PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ గ్రౌండ్ పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. అన్ని మ్యాచ్‌లూ పాక్ గడ్డపైనే జరుగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
గడువు తీరాక వెయిటింగ్ అభ్యర్థులకు నియామక హక్కు ఉండదు: SC

చట్టబద్ధ గడువు ముగిశాక వెయిటింగ్ లిస్టు అభ్యర్థులకు నియామక హక్కు ఉండదని SC స్పష్టం చేసింది. రాజస్థాన్ PSC దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిసులు దీపాంకర్, అగస్టీన్ విచారించారు. నిర్ణీత వ్యవధి ముగిసినా వెయిటింగ్ లిస్టు అభ్యర్థులకు నియామకాలు ఇవ్వాలన్న ఆ రాష్ట్ర HC ఉత్తర్వులను పక్కనపెట్టారు. నాన్ జాయినింగ్ ఖాళీల్లో తమను నియమించాలని వెయిటింగ్ లిస్టు అభ్యర్థుల వ్యాజ్యంలో హైకోర్టు ఆ ఉత్తర్వులు ఇచ్చింది.
News January 19, 2026
మోదీ బయోపిక్‌లో హాలీవుడ్ స్టార్.. బడ్జెట్ రూ.400కోట్లు

PM మోదీ బయోపిక్‌ను ‘మా వందే’ అనే టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పాత్రలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. క్రాంతికుమార్ డైరెక్ట్ చేస్తుండగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి రూ.400కోట్లతో నిర్మిస్తున్నారు. ‘ఆక్వామెన్’ ఫేమ్ జేసన్ మమోవాను ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. JAN 22 నుంచి కశ్మీర్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.
News January 19, 2026
ఇక శాంతి గురించి ఆలోచించను: ట్రంప్

ఎనిమిది యుద్ధాలను ఆపినా నోబెల్ శాంతి బహుమతి దక్కలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌కు ఆయన లేఖ రాశారు. ఇకపై శాంతి గురించి ఆలోచించనని, అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. నోబెల్ ఇవ్వకపోవడమే తన దృక్పథం మారడానికి కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ లీక్ కావడంతో అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.


