News August 19, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహోర్‌లోనే: నఖ్వీ

image

వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆ దేశానికి వెళ్లడంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ట్రోఫీ ఫైనల్‌ను లాహోర్‌ గడాఫీ స్టేడియంలోనే నిర్వహిస్తామని PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ గ్రౌండ్‌ పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. అన్ని మ్యాచ్‌లూ పాక్‌ గడ్డపైనే జరుగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 19, 2024

సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లపై ప్రభుత్వం మరో నిర్ణయం

image

న్యూస్ పేపర్ కొనుగోలు కోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ప్రతి నెలా ఇచ్చే రూ.200 భత్యాన్ని రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏడాదికి రూ.102 కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని CM చంద్రబాబు సూచించారు. మరోవైపు ‘సాక్షి’ పేపర్ కొనుగోలుతో రెండేళ్లలో రూ.205 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.

News September 19, 2024

అన్‌ఫిట్ పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సింగరేణి సీఎండీ

image

TG: సింగరేణిలో అన్‌ఫిట్ పేరుతో కొంతమంది అక్రమార్కులు అమాయకులైన కార్మికులను మోసం చేస్తున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని CMD బలరాం తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థకు నష్టం కలిగించేలా పనులు చేసే వారి సమాచారాన్ని విజిలెన్స్ విభాగానికి 9491144104కు కాల్ లేదా సంస్థకు మెయిల్ చేసి చెప్పాలని సూచించారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల నజరానా ఇస్తామని ప్రకటించారు.

News September 19, 2024

జమిలికి గ్రీన్ సిగ్నల్.. ఎన్నికలు ఎప్పుడంటే?

image

జమిలి ఎన్నికలను కేంద్రం ఆమోదించడంతో ఎన్నికలు ఎప్పుడొస్తాయనే ప్రశ్న నెలకొంది. ఈ విధానం 2029 నుంచి అమల్లోకి రానుందని సమాచారం. అప్పుడు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దేశంలోని 17 రాష్ట్రాల్లో 2026, 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు, మూడేళ్లే అధికారంలో ఉంటాయి.