News August 20, 2024

ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ: మంత్రి డోలా

image

AP: సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలలో చదువుతున్న వారికి ప్రతి నెలా హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని మంత్రి డోలా వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. ప్రతి హాస్టల్‌లో 6 CC కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. SC అభ్యర్థులకు ఉచితంగా DSC శిక్షణ అందిస్తామని వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 3 నెలలపాటు ఈ ట్రైనింగ్ కొనసాగుతుందన్నారు. 16,347 పోస్టులతో మెగా DSC నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Similar News

News January 15, 2025

రోహిత్ పాకిస్థాన్‌కు వెళ్తాడు: బీసీసీఐ వర్గాలు

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్స్ ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌కు వెళ్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 29 ఏళ్ల తర్వాత పాక్ ఐసీసీ టోర్నీ నిర్వహిస్తోందని పేర్కొన్నాయి. ఒకవేళ హిట్ మ్యాన్ నిజంగానే పాక్‌కు వెళ్తే ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, భారత్VSపాక్ మ్యాచ్ 23న దుబాయిలో జరగనుంది.

News January 15, 2025

ఇందిరా భవన్‌కు కాదు లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతాం: కాంగ్రెస్

image

ఢిల్లీలోని తమ కొత్త హెడాఫీసుకు ఇందిరా భవన్ పేరునే కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా పేరుమార్చి ఆయన్ను గౌరవించాలని <<15160758>>BJP<<>> అడగటంపై స్పందించింది. ఇందిరా భవన్‌లోని లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతామని ప్రకటించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి కొత్త ఆఫీసును బుధవారం ఆరంభించిన సంగతి తెలిసిందే.

News January 15, 2025

హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

image

ఒకప్పుడు టాలీవుడ్‌లో సూపర్ హిట్స్ పొందిన హీరో జేడీ చక్రవర్తి లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆయనతో సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేను, సత్య కలిసి సత్య సినిమా చూసేందుకు వెళ్తున్నాం’ అని ఆయన పోస్ట్ చేశారు. 1998లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో రీరిలీజ్ కానుంది.